Type Here to Get Search Results !

తెలంగాణ స్వరాజ్యం వెబ్ న్యూస్ ఛానెల్



తెలంగాణ స్వరాజ్యం పార్టీ వ్యవస్థాపకులు రాష్ట్ర అధ్యక్షులు నాచారం చంద్రశేఖర్ గారు బిజెపి పార్టీ లో చేరిక

               
తెలంగాణ స్వరాజ్యం వార్త ప్రతినిధి...
  తెలంగాణ స్వరాజ్యం పార్టీ వ్యవస్థాపకులు రాష్ట్ర అధ్యక్షులు నాచారం చంద్రశేఖర్ గారు 
చంద్రశేఖర్ గారు మెదక్ జిల్లా రాజకీయాలను పూర్తిస్థాయిలో విశ్లేషించి రాజకీయ పరిజ్ఞానం కలిగి ఉన్న వ్యక్తి సామాజిక రాజకీయ విశ్లేషకులు తనకున్న రాజకీయ పరిజ్ఞానంతో గెలుపోవటంలను అంచనా వేయగల సామర్థ్యం గలవారు
             ఈరోజు భారతీయ జనతా పార్టీ లో చేరడం జరిగింది తను రాజకీయ వ్యవహారాల్లో రాజకీయ పరిజ్ఞానం కలిగి ఉన్న వ్యక్తి రాజకీయ అనుభవాన్ని ఆలోచన విధానాన్ని ప్రజలకు సేవలందించాలని ఉద్దేశంతో తెలంగాణ స్వరాజ్యం పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలకు రాజకీయ సామాజిక సేవలు అందించాలని కలలు కన్నారు, కానీ తన ఆలోచనలకు అనుగుణంగానే బిజెపి పని చేస్తుందని నిర్ణయించుకోవడం జరిగింది ఈ ఉద్దేశంతోనే బీజేపీ రాష్ట్ర నాయకులు మెదక్ పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి, రఘునందన్ రావు గారు మరియు జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ గార్ల సమక్షంలో పార్టీలోకి వెళ్లడం జరిగింది .
                  కేంద్ర ప్రభుత్వం పథకాలు ప్రజలను మభ్య పెట్టే విధంగా గాని మోసపూరితమైన ఆలోచన విధానాల తో గాని కూడుకున్న పథకాలు కావు ప్రజల కోసం కాల అనుగుణంగా ఏర్పాటు చేసినటువంటి పథకాలు కొన్ని పార్టీలు ప్రజల అవసరాల కన్నా పార్టీల అవసరాలు వారి రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పథకాలను ఏర్పాటు చేస్తారు కానీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన పది సంవత్సరాలలో ఉన్నటువంటి పథకాలు ముందస్తుగా గ్యారంటీలు గా అమలు చేసిన పథకాలు కావు ప్రజల అవసరాలను గుర్తించి ప్రజలకు ఏది మంచో ఏది  ఏ పథకాల ద్వారా ప్రజలకు మేలు కలుగుతుందో వాటికి సంబంధించిన అంశాల పైన పథకాలను ప్రజల కోసం ఏర్పాటు చేస్తున్నారని దీని అంతటికి మూల కారణం మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆలోచన విధానమే మూల కారణమని చంద్రశేఖర్ గారు పేర్కొన్నారు ఈ పథకాలు ప్రజల కోసం ఇలాగే కొనసాగుతూ మరిన్ని పథకాలు ప్రజలకు అందుబాటులోకి గ్రామీణ ప్రాంతంలోకి గ్రామ వాకిట్లోకి రావాలి అంటే నరేంద్ర మోడీ గారి తో ఏర్పాటు కావలసిన ప్రభుత్వం ఈ దేశానికి ఈ దేశ ప్రజానీకానికి ఎంతైనా అవసరం ఉన్నది దేశాభివృద్ధిలో ఆర్థిక వ్యవస్థలో నరేంద్ర మోడీ గారి ప్రాబల్యం ఎంతో ఉంది అన్నారు, ఈ రోజుల్లో భారతదేశం ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశాలతో పోటీపడుతూ ప్రపంచాన్ని భారతదేశ వైపు చూపేలా కృషి చేస్తున్నారు మన దేశ ప్రధాని గారు ప్రజల కష్టసుఖాల్లోనూ పాలుపంచుకుంటున్నారు,
                 కరోన సమయంలో ప్రపంచ దేశాలన్నీ మృతదేహాలతో కొట్టుమిట్టాడుతున్న సందర్భాలను మనం చూస్తాం కానీ దేశ ప్రజలను గాని దేశ ఆర్థిక వ్యవస్థను ఆరోగ్య వ్యవస్థను ఏమాత్రం కంగారు పెట్టకుండా ప్రజలను భయభ్రాంతులకు గురి చేయకుండా తన ఆలోచన విధానంతో దేశానికి ప్రపంచ దేశాలకు వ్యాక్సినేషన్ అందించిన దేశం భారతదేశం గా నిలిచింది, కరోనా సమయంలో ప్రజలకు ఎంతో ధైర్యంగా ఉండి ఆర్థికంగాను సామాజిక అవసరాలు తీర్చే విధంగాను నరేంద్ర మోడీ గారి నిర్ణయాలు అమోఘం ఈ విధానాలను దృష్టిలో ఉంచుకొని ప్రజలకు మరింత సేవ చేయాలన్న ప్రజాసేవలో తను  కొనసాగాలన్నా భారతీయ జనతా పార్టీ ఒకటే సరైన మార్గం అని భావించి భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది , 2024 లో జరిగే పార్లమెంట్ ఎలక్షన్లలో బిజెపి ఘనవిజయం సాధిస్తుంది బిజెపి పైన ప్రజలకు పూర్తి నమ్మకం ఉన్నది దేశ భద్రత సామాజిక న్యాయం సామాజిక అవసరాలను తీర్చాలన్న మోడీ గారి ప్రభుత్వం అవసరమేనని ప్రజలు గుర్తిస్తున్నారు రామ మందిని నిర్మాణంలో తనదైన శైలిలో నిర్ణయాలు తీసుకొని యావత్ భారతదేశాన్ని అయోధ్య వైపు చూసేలా చేసిన వ్యక్తి అయోధ్య నిర్మాణంలో ప్రతి ఒక్క ఇల్లు ప్రతి ఒక్క వ్యక్తి అయోధ్య రామ మందిరం నిర్మాణంలో భాగస్వామ్యం చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు అలాగే ఇంకా అన్ని వర్గాల ప్రజలకు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకున్న వ్యక్తి ప్రధాని నరేంద్ర మోడీ గారు కావున వారు తిరిగి భారత దేశ రాజధాని ఢిల్లీలో ప్రధానమంత్రి గా మోడీ ఉండాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు, గల్లీల లో వీధులలో ఏ పార్టీ ఉన్నాగాని ఢిల్లీలో మాత్రం బిజెపి ప్రభుత్వమే ఉండాలని ఈ దేశ భద్రతకు ఆర్థిక భద్రతకు చాలా ముఖ్యమని యావత్ భారతదేశం ఆలోచిస్తుంది, ఈ నిర్ణయాలను దృష్టిలో ఉంచుకొని భారతీయ జనతా పార్టీలో యువత ప్రముఖ నాయకులు నేతలు బిజెపిలోకి వలసలు వెళ్తున్నారు వాళ్ళ పదవులన్నీ ప్రధానమంత్రి గా నరేంద్ర మోడీ ఉండాలన్నదే వారి పదవి ఆకాంక్ష. 

Post a Comment

0 Comments