Type Here to Get Search Results !

jai telangana pillikotal medak

 జై తెలంగాణ

        జై తెలంగాణ జై తెలంగాణ కు ఇప్పుడు 20 సంవత్సరాలు జై తెలంగాణకు 20 సంవత్సరాలు ఏంటి అనుకుంటున్నారా.. మెదక్ జిల్లా మెదక్ మండలం మెదక్ మున్సిపాలిటీ 12వ వార్డుకు చెందిన మేకల నాగేశ్వర్ రెండవ కూతురు పేరు జై తెలంగాణ పేరు చెప్పగానే ఆశ్చర్యానికి గురవ్వాల్సిందే, మేకల నాగేశ్వర్ మొదటి నుంచి 2001లో తెరాసవిభవం నుంచి ఆ పార్టీలను కొనసాగుతున్నాడు తెలంగాణ వీరాభిమాని ఆయన కెసిఆర్ కు మరో వీరాభిమాని ఆయనకు పుట్టిన కూతురు పేరు కూడా జై తెలంగాణ అనే పేరు పెట్టుకున్నడు.

         పాప బర్త్ సర్టిఫికెట్ కూడా జై తెలంగాణ పేరుతోనే తీసుకున్నాడు అంగన్వాడి పాఠశాలలు కళాశా లలో కూడా జై తెలంగాణ పేరుతోనే పాప చదువుకుంటూ వస్తుంది పాప చదువు పూర్తయితుంది కానీ ఆ కుటుంబానికి టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి పది సంవత్సరాలు పూర్తి చేసుకుని వెళ్లిపోయింది కానీ ఆ కుటుంబానికి మాత్రం ఎలాంటి లాభాన్ని కానీ ప్రయోజనాన్ని గాని చేకూర్చలేదు మేకల నాగేశ్వర్ పార్టీ విరకుండా పార్టీ పైన అభిమానంతో తెలంగాణ పైన ప్రేమతో తెలంగాణ ఉద్యమ సమయంలో అనేక రకాల ఉద్యమాలలో పాల్గొని పల్లెనిద్ర కార్యక్రమాలు రాస్తారోకోలు రకరకాల కార్యక్రమాలలో పాల్గొన్నారు జై తెలంగాణ జై జై తెలంగాణ నినాదాలు తెలంగాణ ఉద్యమ సమయంలో పల్లె పల్లెన మార్మోగాయి ఉద్యమ సమయంలో 2010లో తెలంగాణ కు వచ్చిన శ్రీకృష్ణ కమిటీ సభ్యులు కూడా పాప పేరు విని ఆశ్చర్యం వ్యక్తం చేశారు

     ఆమె నెత్తుకొని ముద్దాడారు తెలంగాణ కు ప్రతి రూపంగా తల్లి ఎదగాలని ఇక్కడ ప్రజలు  తెలంగాణని ప్రజల గుండెల్లో నిలుపుకున్నారని వాళ్లకు అర్థమయ్యే రీతిలో మేకల నాగేశ్వర్ కూతురు నిలువెత్తు సాక్షంగా ఎదురుపడింది ఆ సందర్భంలో మేకల నాగేశ్వర్ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడడం చాలా సంతోషంగా ఉందని తన కూతురు పేరు కూడా జై తెలంగాణ కావడం మరింత ఆనందంగా ఉందని వ్యక్తం చేశారు

Post a Comment

0 Comments