Type Here to Get Search Results !

Election Comminssion: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. తెలుగు రాష్ట్రాల్లో బరిలో నిలిచేది ఎవరంటే..

 

రాజ్యసభ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాలకు చెందిన 56 మంది సభ్యుల ఎన్నికకు షెడ్యూల్‌ విడుదలైంది. అయితే తెలుగు రాష్ట్రాల నుంచి ఆరు స్థానాలకు ఎన్నిక జరగనుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురు.. తెలంగాణ నుంచి ముగ్గురు రాజ్యసభ సభ్యుల పదవీకాలం ఏప్రిల్ నెలలో ముగియనుంది. దీంతో ఈ స్థానాల్లో ఎన్నిక జరగనుంది.
రాజ్యసభ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాలకు చెందిన 56 మంది సభ్యుల ఎన్నికకు షెడ్యూల్‌ విడుదలైంది. అయితే తెలుగు రాష్ట్రాల నుంచి ఆరు స్థానాలకు ఎన్నిక జరగనుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురు.. తెలంగాణ నుంచి ముగ్గురు రాజ్యసభ సభ్యుల పదవీకాలం ఏప్రిల్ నెలలో ముగియనుంది. దీంతో ఈ స్థానాల్లో ఎన్నిక జరగనుంది. రాజ్యసభ సభ్యుల నియామకం కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఫిబ్రవరి 8న నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఫిబ్రవరి 15 వరకు నామినేషన్ దాఖలు చేయవచ్చు. ఫిబ్రవరి 16న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఉపసంహరణకు ఫిబ్రవరి 20 వరకు గడువు ఉంటుంది. ఫిబ్రవరి 27న పోలింగ్ నిర్వహించగా.. అదే రోజున సాయంత్రం 5 గంటలకు ఫలితాలు వెల్లడవుతాయి. రాజ్యసభ సభ్యుల ఎన్నిక పరోక్ష పద్ధతిలో జరుగుతుంది.

Post a Comment

0 Comments