Type Here to Get Search Results !

సీఎం రేవంత్ పై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..

 

వంద మీటర్ల లోపల పార్టీని బొంద పెట్టే సంగతి తర్వాత చూసుకుందాం గానీ వంద రోజుల్లో నెరవెరుస్తామన్న హామీలను అమలు చేసే అంశం పైన దృష్టి పెట్టండని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

డబుల్ ఇంజన్ అంటే అదానీ, ప్రధాని అని చెప్పిన రేవంత్ ఇప్పుడు ట్రిపుల్ ఇంజన్ గా మారారని విమర్శించారు. అహంకారంతో మాట్లాడిన రేవంత్ లాంటి నాయకులను బీఆర్ఎస్ పార్టీ ఎన్నో చూసిందని.. అలాంటి వాళ్లందరూ మఖలో పుట్టి పుబ్బలో పోయేవాళ్లేనని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రెండున్నర దశాబ్దాలుగా పార్టీ నిలబడిందన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కేవలం ఒక స్పీడ్ బ్రేకర్ మాత్రమేనని.. ఓడినా గెలిచినా బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ ప్రజలపక్షమేనని స్పష్టం చేశారు.

Post a Comment

0 Comments