Rinku Singh: ఇషాన్ ఔట్.. రింకూ ఇన్.. షాకిచ్చిన బీసీసీఐ.. ఇంగ్లండ్‌తో తలపడే భారత జట్టు ఇదే..
AnonymousJanuary 20, 20240
India A vs England Lions Test: జనవరి 25 నుంచి హైదరాబాద్‌లో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌తో ఇప్పటికే ఇండియా ఏ, ఇంగ్లండ్ లయన్స్ మధ్య అనధికారిక టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభమైంది. తొలి మ్యాచ్ జనవరి 17న అహ్మదాబాద్‌లో ప్రారంభమైంది. ఈ సిరీస్‌లో మరో 2 మ్యాచ్‌లు జరగాల్సి ఉండగా, బీసీసీఐ జట్టును ప్రకటించింది.
Rinku Singh: జనవరి 25 నుంచి భారత్ , ఇంగ్లండ్ (India vs England) మధ్య టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఈసారి ఇరు జట్ల మధ్య 5 టెస్టు మ్యాచ్‌లు జరగనుండటంతో సిరీస్‌పై ఉత్కంఠ నెలకొంది. ఇంగ్లండ్ ఈ టెస్ట్ సిరీస్ కోసం భారత్‌కు రానుంది. త్వరలో టీమ్‌ఇండియా కూడా తన శిక్షణా శిబిరాన్ని ప్రారంభించనుంది. వీటన్నింటి మధ్య రింకూ సింగ్ కూడా ఇంగ్లిష్ జట్టుతో ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఇషాన్ కిషన్‌ను మినహాయించి, రింకూను జట్టులో చేర్చిన బీసీసీఐ.. ఇంగ్లండ్ లయన్స్‌తో జరిగే మ్యాచ్‌కు ఇండియా ఏ జట్టును ప్రకటించింది.