మేము హెల్మెట్ ధరిస్తున్నాం, మీరు తప్పకుండ ధరించండి. హెల్మెట్ వస్తువు కాదు ప్రాణాన్ని కాపాడే ఆయుధం. ట్రాఫిక్ సిబ్బందికి, వారి పిల్లలకు హెల్మెట్ డిస్ట్రిబ్యూషన్ చేశారు డిప్యూటీ కమిషనర్ ఎల్. సుబ్బారాయుడు. హైదరాబాద్లో ఫిబ్రవరి 29న ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, బేగంపేట & నార్త్ జోన్ ట్రాఫిక్, సిబ్బంది ట్రాఫిక్ రూల్స్ పై అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. సికింద్రాబాద్ పీ.జీ. కాలేజ్ ఆడిటోరియం దీనికి వేదికైంది.
మేము హెల్మెట్ ధరిస్తున్నాం, మీరు తప్పకుండ ధరించండి. హెల్మెట్ వస్తువు కాదు ప్రాణాన్ని కాపాడే ఆయుధం. ట్రాఫిక్ సిబ్బందికి, వారి పిల్లలకు హెల్మెట్ డిస్ట్రిబ్యూషన్ చేశారు డిప్యూటీ కమిషనర్ ఎల్. సుబ్బారాయుడు. హైదరాబాద్లో ఫిబ్రవరి 29న ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, బేగంపేట & నార్త్ జోన్ ట్రాఫిక్, సిబ్బంది ట్రాఫిక్ రూల్స్ పై అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. సికింద్రాబాద్ పీ.జీ. కాలేజ్ ఆడిటోరియం దీనికి వేదికైంది. ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది.. వారి పిల్లలకు ఉచితంగా హెల్మెట్ డిస్ట్రిబ్యూషన్ చేసారు అసిస్టెంట్ కమీషనర్ జి. శంకర్ రాజు. రోడ్డు ప్రమాదాలు, నివారణ పేరుతో ప్రత్యేక కార్యక్రమం రూపొందించారు. దీనిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ కమిషనర్ ఎల్. సుబ్బారాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్కువగా యువత ఓవర్ స్పీడ్ , రాంగ్ రూట్ , సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తున్నారన్నారు. ప్రతి ఒక్కరు వాహనం నడిపేటప్పుడు తప్పని సరిగా హెల్మెట్ ధరించాలి అని చెప్పారు. మోటార్ వాహనాల చట్టం ప్రకారము రైడర్, పైయిలాన్ రైడర్ తప్పనిసరి హెల్మెట్ ధరించాలి అని చెప్పారు. చిన్నపిల్లలు కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. వాహనం ముందు కూర్చున్న వ్యక్తి ప్రాణాలు ఎంత ముఖ్యమో వెనుక కూర్చున్న వ్యక్తి ప్రాణాలు కూడా అంతే ముఖ్యం అని పేర్కొన్నారు.
