Telangana: ధరణి సమస్యలకు చెక్ పెడుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం.. దరఖాస్తు తేదీ ఎప్పుడంటే..
March 01, 2024
0
ధరణి మార్గదర్శకాలు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ధరణి సమస్యల పరిష్కారానికి అధికారాలను బదలాయించింది. తహసీల్దార్లు, ఆర్డీవోలు, జిల్లా స్థాయి అధికారులు, సీసీఎల్‌ఏలకు అధికారాలను బదలాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఏ స్థాయి అధికారికి ఎలాంటి అధికారాలు ఉంటాయో మార్గదర్శకాల్లో వెల్లడించింది. ధరణిలో సవరింపు కోసం పెండింగ్‌లో 2,45,037 దరఖాస్తులు ఉన్నాయని తెలిపింది ప్రభుత్వం.ధరణి మార్గదర్శకాలు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ధరణి సమస్యల పరిష్కారానికి అధికారాలను బదలాయించింది. తహసీల్దార్లు, ఆర్డీవోలు, జిల్లా స్థాయి అధికారులు, సీసీఎల్‌ఏలకు అధికారాలను బదలాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఏ స్థాయి అధికారికి ఎలాంటి అధికారాలు ఉంటాయో మార్గదర్శకాల్లో వెల్లడించింది. ధరణిలో సవరింపు కోసం పెండింగ్‌లో 2,45,037 దరఖాస్తులు ఉన్నాయని తెలిపింది ప్రభుత్వం. పట్టాదారు పాసు పుస్తకాల్లో డేటా కరెక్షన్ కోసం ధరణిలో లక్షకు పైగా అప్లికేషన్లు వచ్చాయంటున్నారు అధికారులు. ధరణి సమస్యల పరిష్కార కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తుంది తెలంగాణ ప్రభుత్వం. మార్చి 1 నుంచి 9 వరకు రెవెన్యూ ప్రత్యేక డ్రైవ్‌ని నిర్వహించనున్నారు. కలెక్టర్లకు ప్రత్యేక గైడ్లైన్స్ సీసీఎల్ఏ జారీ చేసి సమస్యల పరిష్కరం దిశగా అడుగులు వేయాలని సూచించింది ప్రభుత్వం.
Tags